విజయనగరం జిల్లా బొత్సవానిపాలెంకు చెందిన ఆర్మీ ఉద్యోగి శంకర్రావు ప్రమాదవశాత్తు మృతి చెందడం తెలిసిందే. ఈ మేరకు ఆయన భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలు సమయంలో మృతుడి భార్య కోమలత రోధిస్తూ నా పిల్లల ఏం పాపం చేశారు. దేవుడా చిన్న వయసులో తండ్రిని దూరం చేసావంటూ రోధిస్తూ తుది వీడ్కోలు పలకడంతో అక్కడ వారు కన్నీరు మున్నీరయ్యారు.