ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డా. దేశాయ్ తిప్పారెడ్డి ఆదివారం స్పందించారు. సరైన ఆధారాలు లేకపోవడంతో మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టులో సైతం ఈ కేసును కొట్టేసిందని ఇప్పుడు రఘురామ ఫిర్యాదు చేస్తే జగన్ పై కేసు నమోదు చేయడం కక్ష సాధింపే అని ఆయన అన్నారు.