ఆక్వా పర్యాటక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కైకలూరుకు స్వర్గధామమైన ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రెండు, మూడు నెలల్లోనే ఆక్వారంగానికి రూ.1.50 పైసలకే విద్యుత్తును అందజేస్తామని మాటిచ్చారు. పార్టీలు ,కులాలు, మతాలు చూడకుండా ప్రతి రైతుకు రాయితీ విద్యుత్ అందజేస్తామని తెలిపారు. కైకలూరులో బీసీ భవన్ నిర్మాణం త్వరలోనే చేపడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆటపాక పక్షుల కేంద్రంతో సహా కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కొల్లేరు కాంటూరూ కుదింపు కచ్చితంగా చేసి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.