ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బుధవారం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమనిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులందరికీ ఆ భగవంతుడు ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.