ఈ నెల 12 నుంచి 14 వరకు హైదరాబాద్ లోని కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ తైక్వాండో చాంపియన్ షిప్ లో ప్రొద్దుటూరుకు చెందిన విన్ తైక్వాండో అకాడమి విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి ఐదు బంగారు, ఒక వెండి పతకం సాధించారని కోచ్ లు కమాల్, సంతోష్ సోమవారం తెలిపారు. వీరిని ఏపీఎస్పీడీసీఎల్ బీసీ సంఘం అధ్యక్షుడు మురళీమోహన్, తల్లిదండ్రులు అభినందించారు.