టీటీడీ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (సిమ్స్)లోని శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో చంద్రగిరి మండలం మల్లయ్యపల్లి గ్రామంలో మంగళవారం మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ద్వారా నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలు క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని క్యాన్సర్ కి కారణాలైన వాటికి దూరంగా ఉండాలని సూచించారు.