గ్యారెంటీడ్ పెన్షన్ జీవో నిలుపుదలకు కృషిచేసిన మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యారెంటీడ్ పెన్షన్ జీవోను నిలుపుదల చేయడం చాలా సంతోషకరం అని లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశాను అని అన్నారు.