ఉపాధి హామీ పథకంలో సిబ్బంది సోమవారం కలెక్టరేట్ లో ద్వామా పీడీ అర్జునరావుపై ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ద్వామా పీడీ అర్జునరావు ఉపాధి హామీలోని సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని అర్జీ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి క్లస్టర్ లో లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పీడీ పై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీలో పేర్కొన్నట్టు తెలియజేశారు.