పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రంలో టెంకాయల విక్రయం, హోటల్ నిర్వహణ హక్కుకోసం జూలై 23న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ సుబ్రమణ్యం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాఘమాసం మినహా మిగిలిన రోజుల్లో మాత్రమే టెంకాయల విక్రయం, హోటల్ నిర్వహణకు అనుమతి ఉంటుందన్నారు. వేలంలో పాల్గొను వారు ముందుగా రూ. 50వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు.