మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటానికి సహకరించాలని మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు కోరారు.