గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని ముద్దాడపేటలో అంగన్వాడీ టీచర్ పై రాజకీయ వేధింపులు ఆపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు విమర్శించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ఉదయం అంగన్వాడీలు ముద్దాడపేటలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపకపోతే, పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.