బడ్జెట్లో మొబైల్ ఫోన్స్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 15 శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు క్యాన్సర్ రోగుల మందులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సోలార్ ఉత్పత్తులపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గించనున్నట్లు తెలిపారు.