ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు రాజేంద్రపాల్ గౌతమ్ మాట్లాడుతూ.... ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా? ఎన్నికల్లో గెల్చిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా? వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అని డిమాండ్ చేసారు.