గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా మన్యుసూక్త హోమం నిర్వహించారు. అర్చకులు ఆలయంలో శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తిని కొలువుతీర్చి వేద మంత్రోచ్చరణల నడుమ తిరుమంజన స్నపనం, మన్యూసూక్త హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.