రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయానికి 13. 60 అడుగులతో గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. దీంతో జల వనరుల శాఖ అధికారులు బ్యారేజీ నుంచి 12. 55 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. అలాగే మూడు పంట కాలవలు ద్వారా 5, 400 క్యూసెక్కుల వీటిని విడుదల చేస్తున్నారు. కాగా ప్రస్తుతం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.