దివ్యాంగులు విధిని ఎదురించి క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మ విశ్వాసంతో ముందుకెళితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురం పట్టణంలోని భవిత కేంద్రంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దివ్యాంగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఇందులో ఉప విద్యాధికారి రంగస్వామి, మండల విద్యాశాఖ అధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మి, పాల్గొన్నారు.