అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి క్లయిమ్ సెటిల్మెంట్ కమిటీ మరియు రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.