ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సదుపాయాలు వైద్యం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలానే ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించి ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తామని సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు.