ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కేసు నమోదు వివరాలు పెండింగులో ఉన్న కేసుల గురించి సంబంధిత అధికారులతో ఆరా తీశారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా పోలీస్ అధికారులు కృషి చేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ కోటయ్య పాల్గొన్నారు.