శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ నాయకుల దాషీ్టకాలు మరింత పెచ్చుమీరాయి అని వైసీపీ నేతలు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ.... దళిత మహిళలను అకారణంగా చిత్రహింసలకు గురిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీనగర్ బండగుంత వద్ద దళిత మహిళలు పద్మ, కల్పన నివాసం ఉంటున్నారు. ఇంటికి ఎదురుగా ఉన్న కంపచెట్ల వల్ల ఇళ్లలోకి పాములు చేరుతున్నాయని, వాటిని తొలగించాలని మునిసిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మునిసిపల్ సిబ్బంది సోమవారం కంపచెట్లు తొలగించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న 34వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్ ముతుకూరు బీబీ.. ‘వాళ్లు వైయస్ఆర్‌సీపీ వలంటీర్లుగా పనిచేశారు. వాళ్లు చెబితే కంపచెట్లు ఎలా తొలగిస్తారంటూ మునిసిపల్ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. దీంతో దళిత మహిళలకు, టీడీపీ వార్డు ఇన్‌చార్జ్ ముతుకూరు బీబీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీబీ దళిత మహిళలపై చేయిచేసుకుంది. దీంతో వారు కూడా ఆమెను ప్రతిఘటించారు. దీన్ని అవమానంగా భావించిన బీబీ తన సోదరుడైన నాగూర్ హుస్సేన్‌కు జరిగిన విషయం చెప్పింది. దీంతో అతను అనుచరగణంతో దళిత మహిళలను ఇష్టానుసారం చితకబాదారు. మహిళల ఛాతి, తలపై దాడి చేశారు. కొట్టొద్దంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. నాగూరు హుస్సేన్ గతంలో నేరచరితుడు కావడంతో మహిళల హాహాకారాలు విన్న స్థానికులు కనీసం విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరకు బాధిత మహిళలు ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలో పడిపోయారు అని తెలిపారు.