ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏవో రవీంద్ర తెలిపారు. ఎస్ కోట మండలం సీతారాంపురం లో ఉడుపు యంత్రంతో వరి నాట్లు వేస్తున్న తీరును శనివారం పరిశీలించారు. ఈ విధానం వల్ల విత్తన ఖర్చు, కూలీల ఖర్చు తగ్గి ఎకరాకు 5 నుండి 6 క్వింటాల అదనపు దిగుబడి పొందవచ్చన్నారు. ఇప్పటికే మండలంలో 40 ఎకరాల మేర యంత్రంతో రైతులు వరి నాట్లు వేసారన్నారు. వి ఏ ఏ రవి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.