మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా శనివారం ఉదయం 438 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం నీటిమట్టం 137 మీటర్ల కాగా వర్షాలు మూలంగా జలాశయంలోకి 219 క్యూసెక్కుల నీరు చేరడంతో పాటు నీటిమట్టం 136. 25కు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమై రెండు గేట్లు ద్వారా 438 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు పెద్దేరు ఏ ఈ సుధాకర్ రెడ్డి తెలిపారు.