పుంగనూరు మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామం వద్ద ఆదివారం పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయానికి వెళుతుండగా మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో రామ్ చరణ్ (17 )అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే సందీప్, ప్రదీప్ గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.