పట్టాదారు పాసుపుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదు అనేది ప్రజా అభిప్రాయం. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. నాటి అహంకార, పెత్తందారీ పోకడలు ప్రజా ప్రభుత్వంలో ఉండవు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది.