రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయమునకు ఎదురుగా ఉన్న సంజీవరాయనికి టిటిడి అధికారులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు స్వామి వారికి పట్టు వస్త్రాలు, గజ మాలలు సమర్పించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం భక్తులను అనుమతింపజేశారు. తీర్థప్రసాదాలను అందజేశారు.