ఏపీ అన్నది కాంగ్రెస్ కి కంచుకోట. దేశమంతా శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించినా జనతా ప్రభంజనం తాకిడి సోకని నేల ఒక్క ఏపీ మాత్రమే. అలాంటి ఏపీ గత పదేళ్లుగా కాంగ్రెస్ ని దూరం పెట్టేసింది. కనీసంగా అయిదారు శాతం ఓటు షేర్ కూడా కాంగ్రెస్ కి లేకుండా పోయింది. కాంగ్రెస్ బేస్ మొత్తం పోయింది. అది అత్యధిక భాగం వైసీపీకి చేరింది. ఈ నేపధ్యంలో వైసీపీ మీద మోజుతో రెండు ఎన్నికల్లో ప్రజలు ఓట్లేశారు. ఒకసారి విపక్షంగా ఉన్నా భారీగానే సీట్లు దక్కాయి. మరోసారి ఏకంగా 151 సీట్లతో అందలం మీద వైసీపీని కూర్చోబెట్టారు. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీని పూర్తిగా పక్కన పెట్టారు.అదే టైం లో ఏపీలో కాంగ్రెస్ వేళ్ళూనుకుంటే వైసీపీ దెబ్బ తింటుందని ఆ పార్టీ ఆలోచిస్తోంది. వైసీపీకి ఎన్నో సమస్యలు ఇలా వెంటాడుతున్నాయి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూల గాలులు వీస్తున్నాయి. దక్షిణాదిన చూసుకుంటే కేరళలో లోక్ సభ ఎన్నికలో మెజారిటీ సీట్లు గెలుచుకుంది. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది.ఏపీలో కాంగ్రెస్ ని ఒక లెవెల్ కి పెంచాలీ అంటే ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ షిప్ కావాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఏపీలో చూస్తే కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కానీ జనం లోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేసే వారు అయితే లేరు అని అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరి జాతీయ స్థాయిలో మద్దతు పొందుతూ ఇండియా కూటమి వేవ్ లో 2029లో ఏపీలో అధికారంలోకి రావచ్చును అన్నది వైసీపీ అధినాయకత్వం ఆలోచన అయితే అయి ఉండవచ్చు అని అంటున్నారు.అంటే కాంగ్రెస్ తో పొత్తుల దాకా వైసీపీ సుముఖంగా ఉంది అని అనుకోవాలి. అయితే కాంగ్రెస్ హై కమాండ్ కి మాత్రం ఇలాంటి ప్రతిపాదనలు నచ్చుతాయా అన్నదే పెద్ద చర్చగా ఉంది అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలం పుంజుకోవడం ఎంత అవసరమో పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం కూడా అంతే ముఖ్యమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు.