టీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బీసీసీఐపై సంచలన ఆరోపణలు చేశారు. బీసీసీఐ కామెంటేటర్ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్‌లు పెట్టిన ఆయన, గత 23 ఏళ్లుగా బీసీసీఐ తనను నిర్లక్ష్యం చేస్తోందని వెల్లడించారు. బ్రాడ్‌కాస్టింగ్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారి కూడా కీలక బాధ్యతలు అప్పగించలేదని ఆయన పేర్కొన్నారు.శివరామకృష్ణన్ పేర్కొన్నట్లు, “నేను బీసీసీఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 23 ఏళ్లుగా పెద్ద మ్యాచ్‌లలో టాస్ వేయడం, అవార్డు ప్రెజెంటేషన్ వంటి బాధ్యతలు నాకు ఇవ్వలేదు. నా తర్వాత వచ్చినవారికి అవకాశాలు వస్తున్నాయి. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్నప్పటికీ, కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్ట్ మరియు ప్రెజెంటేషన్ జరిగింది. నన్ను పక్కన పెట్టి ఇలా చేయడానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఆత్మగౌరవాన్ని త్యాగం చేసి, ఎవరికీ దాసోహం కాలేను. ఈ నిర్ణయం కేవలం ఒక కథకు ప్రారంభం మాత్రమే. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు షాక్ అవుతారని తెలుసు. నన్ను ద్వేషించే వాళ్లు సంతోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. కనీసం నేను మంచి వాడినని భావించే వారికి ధన్యవాదాలు.”ఈ పోస్టులపై రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, “వద్దు” అని రిప్లై ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa