ఐపీఎల్ 2026 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించింది. ఇతర ఫ్రాంచైజీల కన్నా ముందుగా, హోమ్ గ్రౌండ్ చెన్నై చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ క్యాంప్ మొదలుపెట్టారు.మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో, ఆటగాళ్లందరూ కొత్త సీజన్ కోసం కఠోర శిక్షణలో ఉన్నాయి. గంటలకొద్దీ బ్యాటింగ్, బౌలింగ్ సెషన్స్ మరియు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లతో జట్టు సన్నద్ధమవుతోంది.45 ఏళ్ల వయసులోనూ ధోనీ తన ఆటను కొనసాగిస్తున్నాడు. అయితే, నెట్సెషన్ తర్వాత మైదానం వదిలి వెళ్ళే సమయంలో మోకాలి నొప్పితో కుంటుతూ, కాస్త కష్టంగా అడుగు వేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు CSK అధికారికంగా ధోనీ గాయం గురించి ప్రకటన చేయలేదు, అయితే అభిమానులలో అతని ఫిట్నెస్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ధోనీ ఐపీఎల్ 2023 సీజన్ నుంచే ఎడమ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆ సీజన్ ముగిసిన వెంటనే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్లో ప్రముఖ స్పోర్ట్స్ డాక్టర్ దిన్షా పార్దివాలా శస్త్ర చికిత్స చేసి గాయం సరిచేశారు. సర్జరీ తర్వాత కూడా ఐపీఎల్ 2024, 2025 సీజన్లలో ఆడినప్పటికీ, మోకాలి సమస్య పూర్తిగా తగ్గలేదు. తాజాగా అతని కుంటుతున్న వీడియో ఈ విషయం గుర్తు చేస్తోంది.ఈ వీడియోపై అభిమానులు కలవివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు “అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రిటైర్మెంట్ ప్రకటించాలి” అని చెబుతున్నారు, మరికొందరు “చెన్నై జట్టు, అభిమానులపై ఉన్న ప్రేమతో ధోనీ నొప్పిని భరిస్తూ ఆటలో కొనసాగుతున్నాడు” అని అభినందిస్తున్నారు.ఐపీఎల్ ప్రారంభం నుండి, CSK తరపున ధోనీ (తన నిషేధం సీజన్లు తప్ప) ఆడాడు. వికెట్ కీపింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు కీలకంగా నిలిచాడు. కెప్టెన్‌గా మైదానంలో తీసుకునే వ్యూహాలు, నిర్ణయాలు ఏ జట్టు సభ్యుడికీ సాటిలేవు. రిటైర్మెంట్ గురించి ప్రచారం కొనసాగుతున్న క్రమంలో, ఈ వీడియో అభిమానుల ఆందోళనను మరింత పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa