తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఎల్లుండి నుంచి నెల రోజుల పాటు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, ఇతర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి హారతి ఉండదన్నారు. కాగా స్వామి వారి పుష్కరిణిలో నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa