కనిగిరి పట్టణంలో ఇటీవల ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య పరీక్షల్లో శస్త్ర చికిత్సలు అవసరమైన వృద్ధులను వైద్యులు గుర్తించారు. మొదటి విడతగా 103 మందివృద్ధులను సోమవారం ప్రత్యేక బస్సుల్లో గుంటూరు శంకర నేత్ర వైద్యశాలకు శస్త్ర చికిత్సల కోసం స్థానిక అమరావతి గ్రౌండ్ నుండి తరలించారు. ఆపరేషన్లు అవసరమైన వారిని దసలవారీగా గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలిపారు.