విద్యుత్తు సమస్యల పరిష్కారానికి చిత్తూరులో బుధవారం ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామని ఎస్ఈ సురేంద్రనాయుడు మంగళవారం వెల్లడించారు. చిత్తూరు అర్బన్ డివిజన్ కు సంబంధించి గాంధీ రోడ్డులోని ఈఈ కార్యాలయంలో, రూరల్ డివిజన్‌కు సంబంధించి గిరింపేట రూరల్ డివిజన్ ఈఈ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తామని ఈఈలు మునిచంద్ర, హరి తెలిపారు.