అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల గ్రామంలోని సంత మార్కెట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు పూరిళ్లు దగ్ధమైన విషయం విధితమే. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుమారుడు రాజా రూ. 10 వేలు, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు 10వేలు అగ్ని ప్రమాద బాధితులకు అందజేశారు. వీటితోపాటు దుస్తులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.