కౌతాళం మండలం గుడికంబాలి, గోతులదొడ్డి గ్రామాల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను బుధవారం తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ బాగా చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు సర్పంచ్ లక్కే గోవిందు, గోపాల్, రెనప్ప, బసవరాజు, గోపాల్, శీను, వెంకటేష్, రిషి, దేవన్న, హజరత్, మౌను, సోమేష్ పాల్గొన్నారు.