చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయానికి పలువురు టీడీపీ నాయకులు చేరుకుంటున్నారు. దీనితో మున్సిపల్ కార్యాలయం పోలీసుల వలయంలోకి వెళ్లిపోయింది. ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.