ఎం. గౌతమ్ సూర్య గుంటూరు కృష్ణనగర్ 2వలైనులో ఎస్. రోహిత్ కుమార్ కు యాప్ డెవలప్ చేయాలని సంప్రదించాడు. రోహిత్ కుమార్ అందుకు రూ. 16 లక్షలు తీసుకున్నాడు. అయితే అనంతర కాలంలో యాప్ డెవలప్ చేసి ఇవ్వలేదు. గౌతమ్ సూర్య దీనిపై ప్రశ్నించగా రోహితు కుమార్ తిరిగి రూ. 4 లక్షలు ఇచ్చాడు. రూ. 12 లక్షలు ఇవ్వలేదు. గురువారం బాధితుడు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.