సమస్యలు పరిష్కారం కాక వైసీపీ ఐదేళ్ల పాలనలో కష్టాలు, కన్నీళ్లతో కాలం వెళ్లదీసిన బాధితులకు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” భరోసా ఇస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ని నేరుగా కలిసి తమ కష్టాలను ప్రజలు చెప్పుకుంటున్నారు. 20వ రోజు “ప్రజాదర్బార్” కార్యక్రమానికి వేకువజాము నుంచే బారులు తీరారు. ప్రతి ఒక్కరిని నేరుగా కలిసిన మంత్రి.. వారి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.