కందుకూరు నియోజకవర్గంలో ఉదయం నుంచే మొదలైన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కందుకూరు పట్టణం 9వ వార్డు ఆదిఆంధ్ర కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు తాము హామీ ఇచ్చినట్లుగానే, పింఛన్ మొత్తాన్ని పెంచి ఇస్తున్నామని లబ్ధిదారులకు వివరించారు.