రాష్ట్ర రైతుల కోసం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రాయితీపై బిందు సేద్యం అమలుపై అధికారులతో మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు.