నరసన్నపేట మత్స్యకారుల సంఘం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎర్రయ్య తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక మత్స్యకారుల సంఘ భవనంలో కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నికలలో భాగంగా అధ్యక్షుడిగా ఎర్రయ్య, కార్యవర్గ సభ్యులుగా సురేష్, కోశాధికారి కృష్ణారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు వారణాసి వెంకట రమేష్ బాబు పూలమాలతో అధ్యక్షుడని సత్కరించారు.