కృష్ణా జిల్లా, కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే..... గ్రామానికి చెందిన గుదే అఖిల్(28) గుడివాడలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో రికవరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అఖిల్‌కు స్నేహితులైన పామర్తి కృష్ణ, వీరంకి వంశీ కుమార్‌కు ప్రశాంత్ అనే మరో మిత్రుడు వద్ద నుంచి రూ.1.50 లక్ష అప్పుగా ఇప్పించాడు. అయితే కృష్ణ, వంశీ తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని అఖిల్‌పై ప్రశాంత్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన వద్ద డబ్బులు తీసుకున్న కృష్ణ, వంశీ ఇవ్వకపోవడం, డబ్బుల కోసం ప్రశాంత్ ఒత్తిడి అధికమవడంతో అఖిల్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే సమయంలో అఖిల్ సెల్ఫీ వీడియో తీశాడు. కృష్ణ, వంశీలు తనను మోసం చేశారని, డబ్బు తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రాథేయపడినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం బయ టకు వచ్చింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వా స్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తాతాచార్యులు తెలిపారు.