ఉమ్మడి కర్నూలు జిల్లా, పాములపాడు మండలంలోని బానుముక్కల గ్రామ శివార్లలోని ఈదుల వాగులో అనుమానాస్పద స్థితిలో మధు (25) మృతి చెందాడు. ఆదివారం పాములపాడు ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాలివీ.. ఆత్మకురు మండలం కరివేన గ్రామానికి చెందిన నరసింహ తన కుమారుడు మధు కనిపించడం లేదని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం బానుముక్కల గ్రామ శివార్లలోని ఈదుల వాగులో మధు శవమై తేలాడు. దీంతో పాములపాడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.