కందుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జి. ప్రసాద్ బాబు మరియు వ్యవసాయ సబ్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు అనసూయ ఆద్వర్యంలో ఉలవపాడు మండలం అలగాయపాలెం, టెంకాయచెట్ల పాలెం గ్రామ వేరుశనగ రైతులకు జాతీయ ఆహార బద్రత మిషన్ క్రింద సామూహిక ప్రధమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ లో బాగంగా సమగ్ర పోషకాల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ పై శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.