రాజంపేట మున్సిపాలిటీ దళిత కమీషనర్ పై దౌర్జన్యం చేసిన టిడిపి నాయకులు పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు జీరో పల్లి భాస్కర్, సత్యాల రామకృష్ణ, దండు గోపి మంగళవారం డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి అనంతరం చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో, సీఐకు వినతిపత్రం అందజేశారు.