ముఖ్యమంత్రి పర్యటన సమయంలో మధ్యలో నిర్మాణాలు నిలిచిపోయిన ఎత్తైన భవనాలు సైతం అడవి మధ్యలోఉన్నట్లు కనిపించాయి. ఈ పరిస్థితి నుంచి ముందుగా అమరావతిని పూర్తిగా బయటకు తీసుకొచ్చేలా కంపలు, తుమ్మచెట్లను తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సమీక్షలు చేస్తూ పనులను ఎలా మొదలుపెట్టాలనే దానిపై దృష్టి పెట్టారు. దీంట్లో భాగంగానే బుదవారం జంగిల్ క్లియరెన్స్ పనులకు శ్రీకారం చుట్టారు.