పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో వెలసిన శ్రీ యాదగిరప్ప స్వామి శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గురువారం అశేష భక్తవాహిణి నడమ కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి తెల్లవారుజామున ప్రాత: కాల పూజ దీక్షా హోమం, శుభ పుష్కరాంశమునందు యంత్ర ప్రతిష్టలు, లింగాల ప్రతిష్టలు, కలశ ప్రతిష్టలు, కళాభ్యాసం నోత్రోన్మీలనం, పూర్ణాహుతి, కలశం ఉద్వాసనం, కంకణ విసర్జనం నిర్వహించారు. అధిక సంఖ్యలో కురువ సోదరులు ఉన్నారు.