రామసముద్రం మండలం దిన్నిపల్లి సమీపంలోని అడ్డకొండలో వెలసిన శ్రీ గౌతిమ్మరాయ స్వామి ఆలయం శ్రావణ శనివారాలకు రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో ప్రతి శనివారం వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఈ మేరకు ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.