ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటల్లో ఉండే జగన్కు సామాన్య ప్రజల గురించి ఏం తెలుసని అన్నారు.జగన్ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోర్టుకు వెళ్తామని చేసిన ప్రకటనపై నాదెండ్ల స్పందించారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇస్తున్నందుకా, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నందుకా అని ప్రశ్నించారు. మాజీ సీఎం ప్రతిపక్ష హోదా , భద్రతాపై కాకుండా ప్రజల గురించి , ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.