నాగుల చవితిని పురస్కరించుకుని గురువారం ప్రొద్దుటూరు పట్టణంలోని పలు పుట్టలు, ఆలయాల్లోని నాగులకట్ట వద్ద సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. పుట్టల్లో పాలు పోసి చలివిడి, నువ్వుల ఉండలను నైవేద్యంగా సమర్పించి కొబ్బరి కాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలు, విగ్రహాల వద్ద పూజలు చేసి రక్షాదారం కట్టుకున్నారు.