తమ్మిలేరు వరద ఉధృతంగా ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. తమ్మిలేరు కాల్వను ఆయన పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజనవసతి కల్పించాలని ఆర్డీవోకు సూచిం చారు. చోడే వెంకటరత్నం, నెరుసు గంగరాజు, ఆర్నేపల్లి తిరుపతి ఉన్నారు.