84 దేశాలలో కొన్ని వారాలుగా కొవిడ్-19 టెస్టుల్లో పాజిటివ్ ఫలితాల శాతం పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. 'ఇటీవలి నెలల్లో చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒలింపిక్స్ వద్ద కూడా కనీసం 40 మంది అథ్లెట్లకు కొవిడ్ పాజిటివ్ తేలింది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డాక్టర్ వాన్ ఖెర్కోవ్ చెప్పారు. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు ఉనికిలోకి వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.